కుప్పం: గుడిపల్లి : తమిళ సాహిత్య పుస్తకాన్ని ఆవిష్కరించిన ద్రవిడ యూనివర్సిటీ విసి
గుడిపల్లి ద్రవిడ వర్సీటీ తమిళ భాష, అనువాద అధ్యయన విభాగ ఆచార్యులు గణేశ్ మూర్తి పర్యవేక్షణలో M.A పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమిళ సాహిత్యంపై ప్రాజెక్టును పూర్తి చేశారు. 'అధ్యయన రంగం' అనే అంశంపై పూర్తి చేసిన ప్రాజెక్టును ఓ ట్రస్ట్ పుస్తకంగా ప్రచురించారు. ఈ మేరకు పుస్తకాన్ని శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వైస్ ఛాన్సలర్ దొరస్వామి, రిజిస్ట్రార్ కిరణ్ ఆవిష్కరించారు.