కుప్పం: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం
కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం శనివారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా కుప్పం మున్సిపల్ పరిధిలో పలువురికి సర్వే రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోనేందుకే సీఎం సహాయ సహాయ నిధి ఎంతగానో దోహదపడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.