కుప్పం: ప్రతి ఒక్కరూ యోగా చేయడాన్ని అలవర్చుకోవాలి: ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం
ఈనెల 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని కుప్పంలో యోగ వాలంటరీ రిజిస్ట్రేషన్ మరియు సాధన కార్యక్రమాన్ని ఎన్టీఆర్ స్పోర్ట్స్ స్టేడియంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగేంద్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగ చేయడాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, టిడిపి నాయకులు సురేశ్ బాబు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.