ధర్పల్లి: రామడుగులో గ్రామ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు, ఇన్సూరెన్స్
ధర్పల్లి మండలం రామడుగు గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా సందర్భంగా సర్పంచ్ పార్వతి రమేష్ గౌడ్ కొత్త బట్టలు, నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. సిబ్బందికి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, కార్యదర్శి మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.