సిద్దిపేట అర్బన్: జాతీయ లోక్ అదాలతో 4,274 క్రిమినల్ కేసులు, 32 సివిల్ కేసులు, 9 మోటార్ ప్రమాద కేసులు పరిష్కారం జరిగాయి : కోర్టు అధికారులు
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 4,274 క్రిమినల్ కేసులు 32 సివిల్ కేసులు తొమ్మిది మోటార్ ప్రమాద కేసులు పరిష్కరించడం జరిగిందని అధికారులు తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాల మేరకు సిద్దిపేట న్యాయ సేవాధికార సంస్థ సిద్దిపేట ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభించడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని జిల్లా అడిషనల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జి జయ ప్రసాద్, సిద్దిపేట ఇన్చార్జి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, ఇతర జడ్జి లు ప్రారంభించారు