సిద్దిపేట అర్బన్: పట్టణంలోని రంగధాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
సిద్దిపేటకు వారానికి ఒకసారి వచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. కార్యకర్తల మధ్య విభేదాలు ఉంటే పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ప్రజలకు తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి చౌరస్తాలో శనివారం అమరవీరుల స్థూపానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నివాళులర్పించారు. సిద్దిపేటకు తొలిసారిగా వచ్చిన మెదక్ జిల్లా ఇన్చార్జి, మంత్రి వివేక్ కు కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు.