సిద్దిపేట అర్బన్: ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను సమర్ధవంతంగా అందించడమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తా : జిల్లా కలెక్టర్ హైమావతి
ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను జిల్లాలోని ప్రజలకు సమర్థవంతంగా అందించడమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తానని నూతనంగా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కే. హైమావతి తెలిపారు. శనివారం ఐడిఓసి లోని జిల్లా కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ కలెక్టరేట్ కార్యాలయం కు రాగా జిల్లా అదనపు కలెక్టర్లు గరీమ అగర్వాల్, అబ్దుల్ హమీద్ లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్ లో వేద పండితుల ఆశీర్వచనం తీసుకొని జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.