ఒంగోలు అర్బన్: ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సెప్టెంబర్ 14వ తేదీన జరగవలసిన మీకోసం కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ రాజాబాబు వెల్లడి
Ongole Urban, Prakasam | Sep 13, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ రాజాబాబు ఆదివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో రద్దు చేశామని ప్రకాశం జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఒంగోలుకు రాకుండా వ్యవహరించాలని కలెక్టర్ రాజాబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తదుపరి సోమవారం కార్యక్రమం వివరాలు వెల్లడిస్తామన్నారు.