మానకొండూరు: తాడికల్ గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్.. వృధాగా పోతున్న త్రాగునీరు..
తాడికల్ గ్రామంలో మిషన్ భగీరథ పైపు లైన్ లీక్..వృధాగా పోతున్న త్రాగు నీరు...కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాగునీరు వృథాగా పోతోంది. పోచమ్మ గుడి సమీపంలో మిషన్ భగీరథ పైపు లైన్ లీకవడంతో నీరంతా రోడ్డుపై చేరి, బతుకమ్మ ఆడేందుకు వచ్చిన మహిళలకు అసౌకర్యం కలిగించింది. పండుగ పూట ఇలాంటి సమస్యలు తలెత్తడంపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం స్పందించి లీకేజీని అరికట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.