రాజమండ్రి సిటీ: నగరంలో తాగునీటి వ్యవస్థపై కమిషనర్ రాహుల్ మీనా కీలక ఆదేశాలు
నగరంలో తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. సీవీ మార్కెట్ పంప్ హౌస్లో రూ. 37 లక్షల అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, నీటి నాణ్యత పరీక్షలు, లీకేజీల నివారణ మరియు ఇంటింటికి స్వచ్ఛమైన నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.