అశ్వారావుపేట: దమ్మపేటలో తుఫాను నష్టాలపై ఎమ్మెల్యే ఆదినారాయణ పర్యటన, అధికారులకు కీలక ఆదేశాలు
తుఫానుతో దెబ్బతిన్న రోడ్లు, చెరువులు, కాలువలకు వెంటనే మరమ్మతులు చేయాలని దమ్మపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించి నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. లింగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.