కోయిల్ కొండ: గార్లపహాడ్,అభంగపట్నం బ్రిడ్జి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్న గ్రామ ప్రజలు #localissue
మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం గార్లపహాడ్, అబంగపట్నం గ్రామాల మధ్య వాగుపై బ్రిడ్జి పనులు 40 శాతం పూర్తయ్యాయి.కోయిలకొండ నుంచి మహబూబ్నగర్ ప్రధాన రహదారిలో ఆ రెండు గ్రామాలకు వెళ్లాలంటే వాగును దాటుకొని వెళ్లాలి.వర్షాకాలం వచ్చిందంటే చాలు వాగులో నీటి ప్రవాహంతో ఆ గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం బ్రిడ్జి పనులు కొనసాగుతుండడంతో ఆయా గ్రామ ప్రజలు విద్యార్థులు, రైతులు బ్రిడ్జి పనులు వేగమంతం చేయాలని డిమాండ్ చేశారు