మహబూబ్ నగర్ అర్బన్: మహిళలకు భద్రత కల్పించినప్పుడే సమాజానికి భరోసా -సీఐడీ ఎస్పీ అన్యోన్య
మహిళలు, బాలికలు, పిల్లలకు భద్రత కల్పించినప్పుడే సమాజానికి భరోసా ఇచ్చినట్లేనని సీఐడీ ఎస్పీ అన్యోన్య అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో భరోసా, షీ టీం,ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, కళాబృందం సభ్యులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలు, పిల్లల భద్రత కోసం పోలీసులు చేపట్టే ప్రతి చర్యలో భరోసా, షీ టీమ్, ఏహెబ్రీయూ, కళా బృందం కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ప్రతి జిల్లాలోని ప్రతి పాఠశాల, కళాశాల, బహిరంగ ప్రదేశాలు, గ్రామాలు, సున్నితమైన ప్రాంతాల్లో సదస్సులు,అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. సమాజంల