యర్రగొండపాలెం: ఇటీవల మృతి చెందిన బాధితులకు 10 లక్షల రూపాయల చెక్కులు అందజేసిన స్థానిక నాయకులు
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన దండేబోయిన కోటేశ్వరరావు మార్చి 1వ తేదీ కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. అదేవిధంగా రాచకొండ గ్రామానికి చెందిన జెట్టిబోయిన వెంకయ్య వినుకొండ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు ఇరువురి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఎరిక్షన్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు