కనిగిరి: ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి కనిగిరి పట్టణంలోని చింతలపాలెం ఎస్సీ కాలనీ, పామూరు మండలంలోని బొట్లగూడూరు, పెదచెర్లోపల్లి మండలంలోని గుంటుపల్లి గ్రామాల్లో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఏ కుటుంబంలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వివరించారు. ఇంకా అర్హత ఉండి కూడా సంక్షేమ పథకాలు అందకపోతే దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కనిగిరి నియోజకవర్గంలో వలసలను నివారించి, ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.