కనిగిరి: పట్టణంలో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మాలనుకున్న ఏడుగురి అరెస్టు : కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్
కనిగిరి పట్టణంలో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి రూ.10 నుండి రూ 15 కోట్లు విలువచేసే భూమిని , ప్లాట్లు చేసి అమ్మాలనుకున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. బుధవారం కనిగిరి పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాలకొండ రెడ్డి కి చెందిన ఎకరా భూమికి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వీరు అమ్మాలనుకున్నారని డీఎస్పీ తెలిపారు. కనిగిరి సీఐ ఖాజావలి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి, ఏడుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఎక్కడైనా ప్రభుత్వ భూమిని కానీ, ప్రైవేట్ భూమిని కానీ అక్రమంగా అమ్మాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.