నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి
నాగర్ కర్నూల్ మండలం మల్కాపూర్ గ్రామంలో సోమవారం ట్రాక్టర్ బోల్తా పడి ఎడ్ల బాలస్వామి (44) అనే రైతు మృతి చెందారు. పొలం దున్నుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.