గుంటూరు: గుంటూరులో అభివృద్ధి పనులపై కమిషనర్ సీరియస్: డిసెంబర్ లోపు పూర్తికి డెడ్ లైన్
Guntur, Guntur | Nov 14, 2026 గుంటూరులో జరుగుతున్న అభివృద్ధి పనులను డిసెంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. జంక్షన్లు, పార్కుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన ఆయన, నాణ్యత లోపిస్తే అధికారులపై చర్యలు, కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ చేస్తామని హెచ్చరించారు.