శ్రీశైలం: వచ్చే వేసవి వరకు విద్యుత్ కోతలు ఉండే అవకాశం: మహానంది విద్యుత్ శాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి
విద్యుత్ కోతలు ఇలాగే ఉండే పరిస్థితి ఉందని, వినియోగదారులు సహకరించాలని మహానంది మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తిమ్మాపురం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గిందన్నారు. వచ్చే వేసవి కాలం వరకు కోతలు ఉండే అవకాశం ఉందన్నారు. మండల ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు.