కనిగిరి: పట్టణంలోని శంఖవరం ఎస్సీ కాలనీలో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం పండుగను నిర్వహించిన క్రైస్తవులు
కనిగిరి పట్టణంలోని శంఖవరం ఎస్సీ కాలనీలో మట్టల ఆదివారం పండుగను క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి క్రైస్తవులు ఈత మట్టలు మరియు కొబ్బరిమట్టలను చేత బూని ఏసుక్రీస్తు భక్తి గీతాలను ఆలపిస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టల ఆదివారం పండుగ యొక్క విశిష్టతను వివరిస్తూ చర్చి పాస్టర్లు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.