మార్కాపురం: జిల్లా కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఎస్ వి కే పి కళాశాలలో జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల వందనం స్వీకరించారు. వివిధ స్టాల్స్ ను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు అధికారులు ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.