శ్రీశైలం: ఆత్మకూరులో కలకలం రేపిన పులిగోర్ల ఘటనలో 3 అరెస్టు. 6 పులిగోర్లు స్వాదినం , కోర్టులో హజరు
ఆత్మకూరులో పులిగోర్ల స్మగ్లింగ్ కేసు కలకలం రేపుతోంది. పులిగోర్ల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురిని అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఆరు పులి గోర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు, వారిని కోర్టులో హాజరుపరిచారు. పది రోజుల క్రితం ఆత్మకూరు మండలంలోని వరదరాజస్వామి ప్రాజెక్టు సమీపంలో ఓ పులి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఘటన జరిగిన కొద్దిరోజులకే ఆత్మకూరు ప్రాంతంలో ఆరు పులి గోర్లు లభించడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. అంతకుముందు మూడు నెలల క్రితం కొత్తపల్లి మండలంలోనూ పులి గోర్లు లభించిన విషయం తెలిసిందే.