కనిగిరి: పట్టణంలోని అమరావతి గ్రౌండ్ లో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం టిడిపి నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... గత వైసిపి కాలనీలో అక్రమ కేసులు బనాయించి టిడిపి కార్యకర్తలను వేధింపులకు గురిచేసారన్నారు. ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిందన్నారు. కూటమి నాయకులు ప్రజలకు చేతనయినంత సహాయం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కూటమి పార్టీలైన జనసేన, బిజెపితో టిడిపి నాయకులు సమన్వయంతో పనిచేయాలన్నారు.