రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం: రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలి - కమిషనర్ ఆదేశం
రాజమహేంద్రవరం నగరంలో ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు, మోరంపూడి రోడ్డు విస్తరణ పనులపై కమిషనర్ రాహుల్ మీనా సమీక్ష నిర్వహించారు. టీడీఆర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, స్థల యజమానులకు అవగాహన కల్పించి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.