రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు: ఆలయానికి లక్ష విరాళం
రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని నగరంలోని పలు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున రూ.1,00,000 విరాళాన్ని అందజేశారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.