కొండపి: అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నగదు కొరకు రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలి : ఏవో పూర్ణచంద్రరావు
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నగదు కొరకు రైతులు తమ పేర్లను రైతు సేవా కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవాలని పొన్నలూరు మండల ఏవో పూర్ణ చంద్రరావు శుక్రవారం తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతుకు తమ దగ్గర్లోని రైతు సేవా కేంద్రాల్లో ఆధార్ కార్డు, 1బి, బ్యాంక్ ఖాతా నకలుతో వ్యవసాయ సహాయకులను కలిసి పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు.