కొండపి: సింగరాయకొండలో బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా బాలల భవిష్యత్తు గురించి అవగాహన కల్పించిన ఐసిడిఎస్ అధికారులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లో శుక్రవారం బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా బాల్యవివాహాలు మరియు బాలల అక్రమ రవాణా మరియు విద్యా వైద్యం తదితర అంశాలపై ఐసిడిఎస్ అధికారులు ఆశాలకు అంగన్వాడీలకు అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు అరికట్టే అంశంలో అంగన్వాడీలు ఆశాలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూపర్వైజర్ రిజ్వానా అన్నారు. బడి ఈడు పిల్లల్ని గుర్తించి బడులు తెరిచిన సమయంలో వారు చదువుకునే విధంగా చూడాల్సిన బాధ్యత ఆశలు అంగన్వాడీల మీదే ఉందని సూపర్వైజర్ తెలిపారు.