కోరుట్ల: కోరుట్ల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసిన భక్తులు
జగిత్యాల జిల్లా కోరుట్లలోని 1000 ఏళ్ల నాటి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాస తిరునక్షత్రం సందర్భంగా భక్తులు 108 ఆలయ ప్రదక్షిణలు చేశారు. ఆలయ చైర్మన్ ఎతిరాజం నరసయ్య, మాజీ చైర్మన్ జక్కుల ప్రసాద్ మరియు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.