కామేపల్లి: ఖమ్మంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ఖమ్మం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన 155 మంది పోలీసులకు ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబాలను సత్కరించారు.