ఖమ్మం అర్బన్: నేలకొండపల్లి పోస్టాఫీసులో రూ.3.95 లక్షల బీమా క్లెయిమ్ అందజేత
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సబ్ పోస్టాఫీసులో డిసిడిపి కార్యక్రమంలో భాగంగా నామినీ ఇందిరకు రూ.3,95,000 ఆర్పిఎస్ఐ బీమా క్లెయిమ్ అందజేశారు. సౌత్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ పి. శ్రీనివాస్ మాట్లాడుతూ పోస్టల్ పథకాలపై అవగాహన పెంచాలని సూచించారు. అనంతరం మొక్కలు నాటారు.