శ్రీశైలం: శ్రీశైలం మల్లన్న ఆలయంలో నాలుగ రోజు వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం
శ్రీశైలం మల్లన్న ఆలయంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం నాలుగో రోజు వైభవంగా కొనసాగుతోంది. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో ఈ నెల 7 నుంచి 11 వరకు ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు ఏకాదశ రుద్ర, ఋష్యశృంగ సహిత సహస్ర ఘటార్చన, మహాన్యాస, రుద్ర, వేద పారాయణాలతో పాటు రుద్రహోమం, చండీపారాయణ, శ్రీచక్రార్చన, నవావరణార్చనలు నిర్వహించారు. కృష్ణవేణీ నదీజలాలు, మల్లికాగుండ పవిత్ర జలాలతో శ్రీమల్లికార్జున స్వామివారికి వెయ్యికి పైగా కలశాలతో శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు.