పెద్దాపురం: సామర్లకోటలో ఒక్కసారిగా కురిసిన వర్షం: ఇబ్బందుల్లో ప్రయాణికులు
కాకినాడ జిల్లా సామర్లకోటలో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉన్న ఉక్కపోత నుండి ఉపశమనం లభించినా, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ సెంటర్, మెహర్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.