పెద్దాపురం: కాపవరంలో పర్యావరణంపై విద్యార్థుల అవగాహన ప్రచారం: మట్టి గణపతుల వాడకంపై పిలుపు
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కాపవరంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మట్టి గణపతి విగ్రహాల ప్రాధాన్యతను వివరిస్తూ గ్రామంలో ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు అద్దంకి వెంకన్నబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.