శ్రీశైలం: మహానంది మండలం గాజులపల్లెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పూర్తిగా దగ్దమైన బైక్ మెకానిక్ షాప్ 30 లక్షల ఆస్తి నష్టం
మహానంది మండలం గాజులపల్లెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బైక్ మెకానిక్ షాప్ దగ్ధమైన విషయం తెలిసిందే. కాగా షాపులోని 8 బైకులు, స్పేర్ పార్ట్స్, ఆయిల్ క్యాన్లు పూర్తిగా కాలిపోయాయని స్థానికులు తెలిపారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేదన్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేయడంతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.రూ.30 లక్షల నష్టం వాటిలిందని బాధితులు వాపోయారు.