కనిగిరి: పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్సైలతో నేర సమీక్ష నిర్వహించిన డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్
కనిగిరి పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐ లతో సోమవారం నేర సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో వారీగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని డిఎస్పి సూచించారు. తప్పిపోయిన కేసులు, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన కేసుల వివరాలు అడిగి తెలుసుకుని, రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు రౌడీ షీటర్లు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగించాలన్నారు. నేర నియంత్రణకు కృషి చేయాలన్నారు.