కనిగిరి: చిన్న గొల్లపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములను కాపాడాలని తహసిల్దార్ నాగూర్ మీరాను కోరిన ఈవో నరసింహా బాబు
హనుమంతునిపాడు మండలంలోని చిన్న గొల్లపల్లి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహ బాబు హనుమంతునిపాడు తహసిల్దార్ నాగూర్ మీరాను కోరారు. సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ నాగూర్ మీరాను ఈవో కలిశారు. లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ భూములు కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారని, రికార్డులను పరిశీలించి , వాటిని తిరిగి ఆలయానికి అప్పగించాలని కోరారు.