కనిగిరి: ఏరువారిపల్లి లో ఉపాధి కూలీలకు పని దినాలు 200 రోజులకు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీల ర్యాలీ
కనిగిరి మండలంలోని ఏరువారి పల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలకు పని దినాలు 100 రోజుల నుండి 200 రోజులకు పెంచాలని ఉపాధి కూలీలు ర్యాలీ చేపట్టి తమ నిరసన తెలిపారు కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఉపాధి కూలీలకు ప్రభుత్వం పని దినాలు 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడంతో కూలీలు ఇబ్బంది పడుతున్నారని తక్షణం వాటిని చెల్లించాలన్నారు. రోజువారి కూలీ రూ.600 కు పెంచాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.