కనిగిరి: కోయిలంపాడు లో విద్యుత్ తీగలు తెగిపడి ఓ ఇంట్లో చెలరేగిన మంటలు, కాలిపోయిన ఇంట్లోని వస్తువులు
చంద్రశేఖరపురం: విద్యుత్ తీగలు తెగిపోవడంతో ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఇంట్లోనే వస్తువులు కాలిపోయిన సంఘటన చంద్రశేఖరపురం మండలంలోని కోవిలంపాడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోయిలంపాడు గ్రామంలోని మస్తానమ్మ రేకుల నివాసంలో 11 KV విద్యుత్ తీగలు తెగిపడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంట్లోని సైకిల్ , మంచం తోపాటు గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.