కర్నూలు: పత్తికొండలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
పత్తికొండలో జవహర్ లాల్ నెహ్రూ 137వ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు చేపట్టారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు.