రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం విద్యుత్ కాలనీలో ఘనంగా 39వ వినాయక నవరాత్రి ఉత్సవాలు
రాజమహేంద్రవరం విద్యుత్ కాలనీలోని శ్రీ వరసిద్ధి విగ్నేశ్వర స్వామి ఆలయంలో 39వ గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, లలితా పారాయణం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.