ఉరవకొండ: ఉదిరిపికొండ గ్రామంలో స్నానపు గదిలోకి వెళ్లిన మహిళ వాటర్ హీటర్ కు తగిలి విద్యుత్ షాక్ తో మృతి
అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదిరిపికొండ గ్రామంలో రామాంజినమ్మ(40) అనే మహిళ స్నానం చేయడానికి స్నానపు గదిలోకి వెళ్లి వాటర్ హీటర్ కు తగిలి విద్యుత్ షార్ట్ సర్క్యూట్స్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు స్నానానికి వెళ్ళిన రామాంజినమ్మ ఎంతసేపటికి రాకపోవడంతో స్నానపు గది తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే షార్ట్ సర్క్యూట్ అపస్మారక స్థితిలో ఉండటంతో 108 వాహనానికి సమాచారం ఇచ్చి వైద్య సిబ్బంది వచ్చి చూడగా అప్పటికే మృతి చెందిందని ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందజేశారు.