మహబూబాబాద్: మలేరియా పరీక్షలపై ల్యాబ్ టెక్నీషియన్లకు కీలక ఆదేశాలు
మహబూబాబాద్‌లో మలేరియా నిర్ధారణ పరీక్షల నిర్వహణపై డీఎంహెచ్ఓ డాక్టర్ బి. రవి రాథోడ్ ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చారు. రక్తపు స్మియర్ పరీక్షలు సక్రమంగా నిర్వహించి, ఫలితాలను సకాలంలో నివేదించాలని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.