కనిగిరి: జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యామ ప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకోవాలి: కనిగిరి నియోజకవర్గం బిజెపి కన్వీనర్ వెంకటరమణయ్య
పామూరు పట్టణంలో సోమవారం జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని బిజెపి కనిగిరి నియోజకవర్గ కన్వీనర్ కొండిశెట్టి వెంకట రమణయ్య ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బిజెపి కనిగిరి నియోజకవర్గ కన్వీనర్ కొండశెట్టి వెంకటరమణయ్య మాట్లాడుతూ... దేశం కోసం, దేశ ఐక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయనను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని సూచించారు