కనిగిరి: పట్టణంలో రూ.2.20 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డును పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి
కనిగిరి పట్టణంలోని పాతపాల కేంద్రం వద్దనుండి గార్లపేట రహదారి వరకు రూ .2.20 కోట్ల వ్యయంతోనూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డును ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మంగళవారం పరిశీలించారు. సీసీ రోడ్డు నిర్మాణ పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, పనులు నాణ్యవంతంగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సందర్భంగా సిసి రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజీ కాలువలు నిర్మించాలని స్థానికులు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని కోరగా.. త్వరలోనే డ్రైనేజీ కాలువల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.