హిందూపురం పట్టణంలో మెయిన్ బజార్ లో ఉన్న పాల సహకార సంఘం స్థలాన్ని ప్రభుత్వం కాపాడాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హరి, సిఐటియు జిల్లా అధ్యక్షులు జెడ్పి శ్రీనివాసులు, పట్టు రైతు సంఘం జిల్లా కార్యదర్శి సిద్ధారెడ్డిలు డిమెండ్ చేశారు. బుధవారం కబ్జాకు గురి అయిన పాడి రైతుల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హిందూపురం ప్రాంతంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఆధారపడి జీవనం సాగిస్తున్న పాడి పరిశ్రమ రానురాను దిగజారి పోవడంతో ఆ పరిశ్రమకు చెందిన స్థలాన్ని కబ్జా చేసి లక్షల రూపాయలు విలువ చేసే స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ అటు పోలీసులు, ఇటు అధికార