మోత్కూర్: సూర్యాపేట బీజేపీ ఎన్ఆర్ఐ సెల్ జిల్లా కన్వీనర్‌గా బయ్యని చంద్రశేఖర్ నియామకం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్‌గా బయ్యని చంద్రశేఖర్ నియమితులయ్యారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులకు చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.