మోత్కూర్: మోత్కూర్ లో పోషణ మాసం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేలు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మండలంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాలను ఎమ్మెల్యే మందుల సామేలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు అంగన్వాడి కేంద్రాల పరిధిలో గర్భిణీలు పాలించే తల్లులు శిశువులు చిన్నారుల పోసిన పై అవగాహన కల్పించే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ తల్లి బిడ్డ ఆరోగ్యానికి సరైన పోషణ ఎంత ముఖ్యమో ప్రతి కుటుంబం అర్థం చేసుకోవాలని పోషణ మాసంలో ప్రతి తల్లికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించాలన్నారు.