శ్రీశైలం: కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్
సినీ నటుడు శ్రీకాంత్ మహానంది ఆలయాన్ని సందర్శించారు. క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ముందుగా ఆలయ అధికారులు ఆయనకు మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీకాంత్ స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. ఆలయ పర్యవేక్షకుడు శశిధర్ రెడ్డి ఆయనను శేషవస్త్రంతో సత్కరించారు. వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.