కొండపి: పొన్నలూరు మండలం రాజోలు పాడు వద్ద బస్సు సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న మహిళలు, సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి
ప్రకాశం పొన్నలూరు మండలంలో రాజోలపాడు బస్టాండ్లో ఆర్టీసీ బస్సులు ఆపడంలేదని మహిళలువాపోతున్నారు. మహిళలకు ఫ్రీబస్సు కావడంతో ఆర్టీసీసిబ్బంది నిర్లక్ష్యంగా బస్సులు ఆగాల్సినప్రాంతాలలో ఆపకుండావెళుతున్నారు. దీంతోమహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఓకుటుంబం బస్టాండ్ వద్దకువచ్చి బస్సుఎక్కే సమయంలో భర్తనుమాత్రం బస్సుఎక్కించుకొనిభార్యను దించివేసివెళ్లిపోయారని మండలంలో ప్రచారంఉంది. ఆర్టీసీ కండక్టర్లకు సంబంధిత అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటిసంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.