రాప్తాడు: అనంతపురంలో టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి టిడిపి నేతలతో సమావేశమైన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు గురువారం 11 గంటల నుంచి రెండు గంటల వరకు రాప్తాడు నియోజకవర్గానికి చెందిన టిడిపి నేతలతో ఎమ్మెల్యే పరిటాల సునీత సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఈనెల 29న టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలోనూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని అదేవిధంగా మార్చి 31న రాప్తాడులో పి ఫోర్ జీరో ప్రాపర్టీ పై టిడిపి నేతలతో చర్చించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.